Wednesday, January 25, 2012

ఆలోచన

నే చూస్తూనే .. ఓ ఆలోచన
నే వింటూనే .. ఓ ఆలోచన
నే చూస్తున్నది వింటున్నది .. ఓ ఆలోచన



నా స్పర్శయిన .. ఓ ఆలోచన
నా శ్వాసయిన .. ఓ ఆలోచన
నా శ్వాసను స్పర్శించినది ఓ ఆలోచన




నా స్నేహము కోరి
నా ముందు వాలి
నా లోన చేరి
నా లోన దాగెను .. ఈ ఆలోచన.



అనువనువుకు చేరి
అనుకువగా మారి
మురిపించెను నన్నే
మరిపించెను నన్నే .. ఈ ఆలోచన.



నా స్వార్ధముగా నను సంధించి
నా స్వ అర్ధమును బంధించి
నా రథమును చేపట్టి
సారథి అయి సంచరించి
సర్వము తానే అనిపించేలచేసేను
సత్యము తానై కనిపించేలా ..  ఈ ఆలోచన.



అంధకారములో మునిగేలా
ఆవేశముతో కదిలేలా
ఆనందము తోలగేల
అలజడులు సృష్టించెను .. ఈ ఆలోచన.




కలలాగ చేరినా
కళలాగ మారినా
కలకాలము ఉండునా .. ఈ ఆలోచన ..



ఆలోచనలకు ఆది ఒక ఆలోచనయే
ఆలోచనలకు అంతము ఒక ఆలోచనయే



... రాజేష్ కాట్రెడ్డి

No comments: