ఓ కాలమా .. కరిగిపోవె
ఈ సమయమే
... నిలిచిపోవె.
ఇసుకతిన్నెల .. పై నే
వాలి
మసకవెన్నెల
.. పొందుకో రి
.. అందుకోని
.. హత్తుకోని
.. నిదురకోనీ
నీటినురుగే
.. తాకగా
అలలు సడులే..
చెయగా
జోలపాటగ .. మారగా..
ఈ.. లోకమంత
నా .. సొంతమంటా
ఈ .. రాతిరంతా
రాగం .. ఆగదంట
ఓ సంద్రమా... సాయపడవే
దుప్పటల్లె నన్ను
.. చుట్టుకొవే
ఓ చంద్రమా
.. చెంతరావే..
వెండిమబ్బులే .. వెంటతెవే
వాన జల్లై .. జోరుగా
నీలి మేఘం
.. కురవగా
తిమిరతెరలే
.. తొలగగా
గాథలన్నీ ..
చెరపగా
బాధలన్నీ ..
మరువగా
ఈ రేయే .. కొత్త ఉదయం
ఇదేలే .. సుప్రభాతం
నేడె .. కడలితీరం
చేసే .. ఇంద్రజాలం